హృదయ విదారక ఘటన: పిల్లలతో పాటు తల్లి కూడా..
దిశ, ఖమ్మం: అభం శుభం తెలియని తన చిన్నారులను కఠిన మనస్సుతో నీళ్లలోకి తోసి తాను కూడా అదే నీటిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటలం ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో కుటుంబ కలహాలు కారణమైయ్యాయో.? మరే ఇతర కారణాలు ఉన్నాయో తెలియరాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలతో సహా తల్లి మున్నేరులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన […]
దిశ, ఖమ్మం: అభం శుభం తెలియని తన చిన్నారులను కఠిన మనస్సుతో నీళ్లలోకి తోసి తాను కూడా అదే నీటిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటలం ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో కుటుంబ కలహాలు కారణమైయ్యాయో.? మరే ఇతర కారణాలు ఉన్నాయో తెలియరాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలతో సహా తల్లి మున్నేరులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో పూల వ్యాపారం నిర్వహిస్తున్న రత్నావత్ శ్రీనివాస్ కుమార్తె దోన్‌వాన్ వనిత(29)ను స్థానిక రేవతి సెంటర్‌కు చెందిన దోన్‌వాన్ రవి అలియాస్ చిన్నయ్యకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు.
రవి ఆటో నడువుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి దోన్‌వాన్ చైతన్య(9), కుమారుడు రోహిత(8)లు ఉన్నారు. పెండ్లీ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు సర్ధిచెప్పుతూ ఉండేవారు. భర్త ఆటో నడువుతుండగా.. వనిత కూడా ఓ మార్ట్‌లో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ సాపీగానే జీవనం సాగిస్తున్నారు. గత 20 రోజుల క్రితం భర్త రవికి కరోనా పాజిటీవ్ రావడంతో వనిత తన ఇద్దరు పిల్లలతో కలసి యుపీహోచ్ కాలనీలోని తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. పిల్లలను అక్కడే ఉంచి తాను అక్కడి నుంచే రోజు మార్ట్‌లో పనిచేసేందుకు వెళ్తోంది.
ఈ క్రమంలో ఉదయం ఇంటి నుండి తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చిన వనిత కొద్ది సేపటికే పిల్లలతో సహా మున్నేటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగింది. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకొని స్ధానికుల సహాయంతో మృతదేహాలను భయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వనిత ఇటీవల ఓ మని సర్కిలేషన్ స్కీమ్‌కు సంబంధించిన లావాదేవీలో ఇతర వ్యక్తుల నుంచి బత్తిడి కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మరోక వాదన వినిపిస్తోంది. పోలీసులు పూర్తి విచారణ సాగిస్తే గాని ఆత్మహత్య గల కారణాలు బయటపడేలా కనిపించడం లేదు.