ఇద్దరు కొడుకులపై కేసు పెట్టిన తల్లి..
దిశ, మునుగోడు: తన ఇద్దరు కొడుకులపై ఓ తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన వద్దనున్న బంగారం లాక్కుని.. తిండిపెట్టకుండా ఇంట్లోంచి గెంటేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెల్లా సంపూర్ణమ్మకు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు తమ తల్లి దగ్గర ఉన్న బంగారం మొత్తం లాక్కుని, గత కొన్ని రోజులుగా […]
దిశ, మునుగోడు: తన ఇద్దరు కొడుకులపై ఓ తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన వద్దనున్న బంగారం లాక్కుని.. తిండిపెట్టకుండా ఇంట్లోంచి గెంటేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెల్లా సంపూర్ణమ్మకు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు తమ తల్లి దగ్గర ఉన్న బంగారం మొత్తం లాక్కుని, గత కొన్ని రోజులుగా కన్నతల్లికి అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. అంతే కాకుండా గురువారం ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆ రోజున యాదగిరిగుట్ట పాత లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో సంపూర్ణమ్మ తలదాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆమెను చేరదీసి శనివారం చౌటుప్పల్‌కు పంపారు. సంపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు ఆమె ఇద్దరు కుమారులపై తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.