తల్లి, కూతురు మృతి.. కారణం అదే అంటున్న కుటుంబసభ్యులు
దిశ, నిజామాబాద్ రూరల్: ఐదు రోజుల వ్యవధిలోనే కరోనాతో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్లంగి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లత దంపతులకు ఒక్కగానొక్క కూతురు సంధ్య (23) అయితే ఆమెకు రెండు సంవత్సరాల క్రితం ఇందల్వాయి మండలం తిర్మనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలో సంధ్యకు పది రోజుల క్రితం కరోనాపాజిటివ్ నిర్ధారణ […]
దిశ, నిజామాబాద్ రూరల్: ఐదు రోజుల వ్యవధిలోనే కరోనాతో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్లంగి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లత దంపతులకు ఒక్కగానొక్క కూతురు సంధ్య (23) అయితే ఆమెకు రెండు సంవత్సరాల క్రితం ఇందల్వాయి మండలం తిర్మనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.
ఈ నేపథ్యంలో సంధ్యకు పది రోజుల క్రితం కరోనాపాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా తీవ్ర అస్వస్థతకి గురై, ఓ మగబిడ్డకు జన్మనిచ్చి ఈ నెల పద్నాలుగున ఆమె మృతి చెందింది. అలానే సంధ్య తల్లికి కూడా గత నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. ఐదు రోజుల్లో కుమార్తె భార్య మృతితో శ్రీనివాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబంలో ఒక్కసారిగా కరోనా రెండు నిండు ప్రాణాలను బలిగొందని ముల్లంగి గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.