కరోనా.. ‘కల’వరం

దిశ, వెబ్‌డెస్క్ : అందరి జీవితాలను కరోనా కలవరపెడుతోంది. డిస్టర్బ్ చేస్తోంది. ఇల్లు దాటి బయటి ప్రపంచాన్ని చూడలేం. స్నేహితులను, బంధువులను ఎవర్నీ కలవలేం. నచ్చిన ప్రదేశాలకు వెళ్లలేం. సమూహాల్లో తిరగలేం. ఈ ఊహాలే మనిషిని ‘కల’లా వెంటాడుతున్నాయి. ఇది జోక్ కాదు.. చాలా మందిలో కరోనా వల్ల కలిగిన ఆందోళన.. కలల రూపంలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో మనం చూస్తే… చాలామంది నెటిజన్లు తమకు వచ్చిన ‘కలలు’ గురించి చర్చిస్తున్నారు. వైరస్ వ్యాప్తి కలిగిన ఆందోళన, […]

Update: 2020-04-22 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
అందరి జీవితాలను కరోనా కలవరపెడుతోంది. డిస్టర్బ్ చేస్తోంది. ఇల్లు దాటి బయటి ప్రపంచాన్ని చూడలేం. స్నేహితులను, బంధువులను ఎవర్నీ కలవలేం. నచ్చిన ప్రదేశాలకు వెళ్లలేం. సమూహాల్లో తిరగలేం. ఈ ఊహాలే మనిషిని ‘కల’లా వెంటాడుతున్నాయి. ఇది జోక్ కాదు.. చాలా మందిలో కరోనా వల్ల కలిగిన ఆందోళన.. కలల రూపంలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో మనం చూస్తే… చాలామంది నెటిజన్లు తమకు వచ్చిన ‘కలలు’ గురించి చర్చిస్తున్నారు. వైరస్ వ్యాప్తి కలిగిన ఆందోళన, కోవిడ్ -19 పైన ఉన్న అపోహలు, వస్తున్న వార్తలు ఇవన్నీ కలగలిసి మనిషి నిద్రలో ఉన్నప్పుడు ‘అసహజమైన కలలు’గా వస్తాయని సైన్స్ చెబుతోంది.

మనిషికి ఆందోళన ఉంటే.. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు సరైన నిద్రను కూడా దూరం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆందోళన పెరుగుతున్న కొద్దీ.. నెగెటివ్ కలలు పెరిగిపోతాయి. కరోనా వల్ల జరుగుతుందదేనని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో మూడు కలలు మాత్రం ఎక్కువమందిలో వస్తున్నాయి.

బాల్యంలోకి :

గతంలో గడిపిన ప్రదేశానికి వెళ్లినట్లు కొంతమంది కల కంటుంటారు. ఎందుకంటే.. అక్కడికి వెళితే వారికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ కలనే.. వారిలో ఆందోళన ఉందనడానికే సంకేతంగా చెప్పొచ్చు. ఉదాహరణకు చాలామంది తమ ‘బాల్యం’లోకి లేదా ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లు కలలు కంటారు. బాల్యం వారికి చాలా సెక్యూర్‌గా అనిపించడమే అందుకు కారణం. బాల్యంలో ఎలాంటి భయాలు ఉండవు. ఎప్పుడూ అమ్మ, నాన్న లేదా మన ఇంటి సభ్యులు మన చెంతనే ఉంటారు. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్ ప్లేస్‌గా భావిస్తారు.

గెట్ టు గెదర్ :

ఇది కూడా చాలామందిలో వస్తున్న కామన్ కల. కరోనా కారణంగా అందరం కూడా ఇళ్లల్లోనే ఉండిపోయాం. ఎక్కడికీ వెళ్లడానికి వీలులేకుండా అయిపోయింది. కానీ, గతంలో ఎటువంటి సందేహం, సంశయం లేకుండా పార్టీలు చేసుకున్నాం.. స్నేహితులను కలుసుకోని చిల్లవుట్ అయ్యాం. వేడుకలను చేసుకున్నాం. సో ఇప్పుడవన్నీ కుదరటం లేదు. అందువల్ల ఒక్కసారిగా అందరం కలిసి పార్టీ చేసుకున్నట్లు, లేదా అంతా గెట్ టుగెదర్ అయినట్లు కలలు వస్తుంటాయి. ఇది కూడా కరోనా ఆందోళన నుంచి వచ్చిన కలే. కరోనా అందరి జీవితాలతోపాటు, మన జీవితంలో కూడా ఫ్రీడం లేకుండా చేసిందని, అందుకు మనం ఫీల్ అవుతున్నామన్నదానికి ఈ కల సంకేతం.

మిస్సింగ్ ఫేవరేట్ ఫుడ్ :

కరోనా విజృంభిస్తున్నవేళ.. కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో షాపులన్నీ కూడా మూతపడ్డాయ్. ఆ మూసేసిన జాబితాలో.. మనం తరుచుగా తినే ఫేవరేట్ ఫుడ్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్‌గా మన ఇష్టపడి తినే ఫుడ్స్ అన్నీ కూడా మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఉదాహరణకు పరీక్షలప్పుడే మనకు నిద్ర ఎక్కువగా వస్తుంటుంది. గాంధీ జయంతి రోజే చికెన్ తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడే ఎక్కువగా ఆకలేస్తుంది. ఇలా కొన్ని కొన్ని దొరకనప్పుడు అవే కావాలనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. ప్రస్తుతం కూడా చాలామందిలో ఇదే ఫీలింగ్ ఉంది. అందుకే తాము మిస్ అవుతున్న ఫుడ్‌ని తింటూ ఎంజాయ్ చేస్తున్నట్లు కలల్లో విహరిస్తున్నారు.

Tags: corona virus, lockdown, dreams, weird, childhood, missing favorite food, party, together

Tags:    

Similar News