మీ బ్రేక్‌ఫాస్ట్‌ ఇలా తింటున్నారా..? అయితే జాగ్రత్త..

దిశ, వెబ్‌డెస్క్: ఉదయం పూట తినే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు నిపుణులు. కొందరు ఉదయం పూట అల్పహారం తీసుకోకుండానే గడిపేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కొందరు ఒక బౌల్లో ధాన్యాలు వేసుకొని బౌల్ నిండుగా పాలు పోసుకొని గబాగబా తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు. ధాన్యాలలో అధిక శాతం కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అవి మీ జీర్ణ ప్రక్రియపై ప్రభావం […]

Update: 2021-07-23 22:42 GMT
దిశ, వెబ్‌డెస్క్: ఉదయం పూట తినే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు నిపుణులు. కొందరు ఉదయం పూట అల్పహారం తీసుకోకుండానే గడిపేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కొందరు ఒక బౌల్లో ధాన్యాలు వేసుకొని బౌల్ నిండుగా పాలు పోసుకొని గబాగబా తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు.
ధాన్యాలలో అధిక శాతం కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అవి మీ జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం పూట సమయానికి అల్పహారం తినకుంటే షుగర్ లెవెల్స్‌లో కూడా మార్పులు వస్తాయని న్యూట్రిషనిస్ట్స్ అంటున్నారు. కొన్ని స్పూన్స్ సెరల్స్‌తో పాటు సరిపడ పాలు పోసుకొని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణుల సలహా.
Tags:    

Similar News