ఏపీ ఉక్కిరిబిక్కిరి… 500 దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విజృంభించి నమోదవుతున్నాయి. నిన్న పది కేసులు నమోదై గుంటూరు జిల్లాలో ఆందోళన పెంచగా, నేడు 19 కొత్త కేసులు నమోదై కర్నూలు జిల్లాను భయాందోళనల్లోకి నెట్టాయి. ప్రస్తుతం ఏపీలో 502 కరోనా కేసులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 118 కేసులు నమోదు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ జిల్లాలో ప్రస్తుతం 114 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో కర్నూలు […]
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విజృంభించి నమోదవుతున్నాయి. నిన్న పది కేసులు నమోదై గుంటూరు జిల్లాలో ఆందోళన పెంచగా, నేడు 19 కొత్త కేసులు నమోదై కర్నూలు జిల్లాను భయాందోళనల్లోకి నెట్టాయి. ప్రస్తుతం ఏపీలో 502 కరోనా కేసులు ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో 118 కేసులు నమోదు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ జిల్లాలో ప్రస్తుతం 114 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. ఈ జిల్లాలో 97 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. దీంతో 96 పాజిటివ్ కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృత్యువాత పడగా, మరొకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ జిల్లాలో 54 కరోనా కేసులున్నాయి.
కృష్ణా 45, ప్రకాశం 42, కడప 33, వెస్ట్ గోదావరి 31, చిత్తూరు 23, అనంతపురం, విశాఖపట్టణం జిల్లాల్లో 20 చొప్పున కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడగా, 16 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 475 యాక్టివ్ కేసులున్నాయి.
Tags: coronavirus, covid-19, andhra pradesh, positive cases