దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ.. 4 లక్షలకు పైగా కొత్త కేసులు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 4,03,738 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 4,092 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. మరణాల సంఖ్య 2,42,362కు పెరింగింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 4,03,738 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 4,092 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. మరణాల సంఖ్య 2,42,362కు పెరింగింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది.
ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,86,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,83,17,404కి చేరింది. రికవరీ రేటు 82.2 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం భారత్‌లో 37,36,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,65,428 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 30 కోట్ల 22లక్షల 75వేల 471 టెస్టులు చేశారు. కొత్తగా 20,23,532 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 16కోట్ల 94లక్షల 39వేల 663మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.