మరిన్ని శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు, పర్యాటకులను స్వరాష్ట్రాలకు పంపించేందుకు మరిన్ని శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు కేంద్రం అనుమతితో భారత రైల్వే ప్రత్యేకంగా ట్రైన్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల అభ్యర్థనల మేరకు వలసజీవులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు శుక్రవారం ఐదు స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది. కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు శుక్రవారం […]
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు, పర్యాటకులను స్వరాష్ట్రాలకు పంపించేందుకు మరిన్ని శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు కేంద్రం అనుమతితో భారత రైల్వే ప్రత్యేకంగా ట్రైన్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల అభ్యర్థనల మేరకు వలసజీవులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు శుక్రవారం ఐదు స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది. కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు శుక్రవారం ఈ స్పెషల్ ట్రైన్‌లు బయల్దేరాయి. తాజాగా, మరిన్ని స్పెషల్ ట్రైన్‌లను భారత రైల్వే ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి లక్నోకు శనివారం ఉదయం 847 మందితో ఒక స్పెషల్ ట్రైన్ బయల్దేరి వెళ్లింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌ల నుంచి ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు శనివారం రాత్రి ప్రయాణం కట్టనున్నాయి. కాగా, కేరళలోని తిరువనంతపురం నుంచి ఒక నాన్ స్టాప్ ట్రైన్.. జార్ఖండ్‌లోని హతియాన్‌కు వెళ్లింది. తిరూర్, కోజికోడ్, దక్షిణ ఎర్నాకుళం, అలువా నుంచి శనివారం రాత్రి బీహార్, జార్ఖండ్, ఒడిశాలకు వెళ్లనున్నాయి.
tags: shramik trains, stranded, migrants, centre, state, ferry