జూలై 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలను నిర్వహించాలని సిఫార్సులో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ పేర్కొంది. కొవిడ్ కారణంగా అత్యవసర నిమిత్తం కొన్ని సందర్భాలు మినహా ఏడాదిన్నరగా పార్లమెంట్ సమావేశాలు సరిగా కొనసాగలేదు. 2021 బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలను అటుఇటుగా […]
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలను నిర్వహించాలని సిఫార్సులో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ పేర్కొంది. కొవిడ్ కారణంగా అత్యవసర నిమిత్తం కొన్ని సందర్భాలు మినహా ఏడాదిన్నరగా పార్లమెంట్ సమావేశాలు సరిగా కొనసాగలేదు.
2021 బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలను అటుఇటుగా నాలుగు వారాల పాటు నిర్వహించేందుకు కేబినెట్ కమిటీ సూచించింది. ఇక పార్లమెంట్‌లోనూ కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.