వర్షాకాలంలో మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు..
దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం మొదలయ్యాక చాలా మంది అనారోగ్యం భారీన పడుతుంటారు. సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడైన మంచీనీటి పైప్ పగిలిపోతే నీరు కలుషితం అవుతుంది. దీనివలన పచ్చకామర్లు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సామూహిక ప్రదేశాల్లో తాగు నీటి సరఫరా సురక్షితంగా ఉండక పోవచ్చు. కలుషితమైన నీటిని మనం తీసుకోవడం వలన నీటిలో ఉన్న కాలుష్య కారక సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాల వలన డయేరియా, […]
దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం మొదలయ్యాక చాలా మంది అనారోగ్యం భారీన పడుతుంటారు. సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడైన మంచీనీటి పైప్ పగిలిపోతే నీరు కలుషితం అవుతుంది. దీనివలన పచ్చకామర్లు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సామూహిక ప్రదేశాల్లో తాగు నీటి సరఫరా సురక్షితంగా ఉండక పోవచ్చు.
కలుషితమైన నీటిని మనం తీసుకోవడం వలన నీటిలో ఉన్న కాలుష్య కారక సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాల వలన డయేరియా, కామెర్లు వచ్చే అవకాశం చాలా ఉంది. ముఖ్యంగా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకోసం మనం బయట ఆహారం తీసుకోవడం చాలా వరకు మాను కోవాలి, ఎప్పుడూ వేడిగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు చాలా దూరంగా ఉండాలి. కరోనా నుంచి ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఈ సీజనల్ వ్యాధుల భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవల్సిన అవసరం చాలా ఉంది.
వర్షకాలం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ చిట్కాలు ..
పసుపు..
రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ వర్షకాలంలో పసుపును క్రమం తప్పకుండా ఆహారం లేదా పాలతో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి మానసిక స్థితి అదుపులో ఉండేలా చేస్తుంది.
అల్లం వెల్లుల్లి
ప్రతి సీజన్‌లో అల్లం వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఇది క్లినికల్‌లో కూడా తేలింది. వర్షాకాలంలో వీటిని తినడం వల్ల ప్రతీఒక్కరూ సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సంసిద్ధమైనట్లే. అయితే వెల్లుల్లి ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రేస్ (ఆక్సీకరణ ఒత్తిడి)ని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిని వర్షకాలంలో రోజు తీసుకోవడం వలన ఎలాంటి అంటు వ్యాధులు దరి చేరవు.
గోరు వెచ్చటి నీరు..
వర్షకాలం సమయంలో సీజనల్ వ్యాధులు మన దరి చేరకుండా ఉండేందుకు రోజు ఉదయం కాచి చల్లార్చిన నీటి తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వ్యాయామం..
రోజు వ్యాయామం చేయడం వలన మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు. వ్యాయమం చేయడం వలన ఎలాంటి అనారోగ్య పరమైన సమస్యలు మన దరి చేరవు. వ్యాయమం చేయడం వలన ఎముకలు , కండరాలు ధృడంగా మారి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కషాయాలు.. హెర్బల్ టీ
వర్షా కాలంలో మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపర్చుకోవడానికి హెర్బల్ టీ లేదా కషాయాలను క్రమం తప్పకుండా తాగాలి. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు. వీటిని తాగడం వలన సీజనల్ వ్యాధులు మన దరికి చేరకుండా ఉంటాయి.