ఈ వానరం మరీ విడ్డూరం.. కుక్క పిల్లను అస్సలు వదలని వైనం

దిశ, వేములవాడ : జాతి వైరం మరిచిన వానరం తన సొంత బిడ్డలా కుక్క పిల్లను దగ్గరకు తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా కుక్కలకు కోతి కనిపిస్తే చాలు.. దాడి చేసేందుకు మీదకు వెళ్లడం, అరవడం దాని లక్షణం. కానీ, ఇక్కడ మాత్రం ఆప్పుడే పుట్టిన కుక్క పిల్లను తన పిల్లలగా భావించిన కోతి అక్కున చేర్చుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామంలో అప్పుడే […]

Update: 2021-06-23 10:45 GMT

దిశ, వేములవాడ : జాతి వైరం మరిచిన వానరం తన సొంత బిడ్డలా కుక్క పిల్లను దగ్గరకు తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా కుక్కలకు కోతి కనిపిస్తే చాలు.. దాడి చేసేందుకు మీదకు వెళ్లడం, అరవడం దాని లక్షణం. కానీ, ఇక్కడ మాత్రం ఆప్పుడే పుట్టిన కుక్క పిల్లను తన పిల్లలగా భావించిన కోతి అక్కున చేర్చుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

గ్రామంలో అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకొని ఇళ్లలో తిరుగుతూ అక్కడి వారు పెట్టిన పండ్లను తింటూ కుక్క పిల్లతో ఆడుతూ కనిపించింది. గమనించిన గ్రామస్తులు కుక్క పిల్లను తీసుకునే ప్రయత్నం చేయగా, వారి మీద దాడికి చేసేందుకు వానరం యత్నించింది. ఈ దృశ్యాలను వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Tags:    

Similar News