ఐటీ రంగానికి ఏడాది పాటు కష్టాలు తప్పవు!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది భారత ఐటీ కంపెనీలు నియామకలేవీ చేపట్టకపోవచ్చని, కొవిడ్-19 ప్రభావం వల్ల నష్టాలను అధిగమించేందుకు సీనియ ఉద్యోగుల జీతాల్లో కూడా 20 నుంచి 25 శాతం కోత ఉండొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ చెప్పారు. జీతాల్లో కోత రూ. 75,000 కు మించి వేతనమున్న వారికే కానీ అంతకన్నా తక్కువ ఉన్నవారికి ఎలాంటి కోటలుండవని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ ఆంక్షలు, సామాజిక దూరం పాటించాలనే నిమంధనల వల్ల ఆఫీసుల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది భారత ఐటీ కంపెనీలు నియామకలేవీ చేపట్టకపోవచ్చని, కొవిడ్-19 ప్రభావం వల్ల నష్టాలను అధిగమించేందుకు సీనియ ఉద్యోగుల జీతాల్లో కూడా 20 నుంచి 25 శాతం కోత ఉండొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ చెప్పారు. జీతాల్లో కోత రూ. 75,000 కు మించి వేతనమున్న వారికే కానీ అంతకన్నా తక్కువ ఉన్నవారికి ఎలాంటి కోటలుండవని ఆయన వెల్లడించారు.
లాక్‌డౌన్ ఆంక్షలు, సామాజిక దూరం పాటించాలనే నిమంధనల వల్ల ఆఫీసుల్లో పనిచేయడానికి ఉండే ఇబ్బందులను ఐటీ రంగం సమర్థవంతంగానే అధిగమించిందని, 90 శాతం వరకూ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఇంకో ఏడాది వరకూ ఐటీ కంపెనీలకు కార్యాలయ వసతి డిమాండ్ ఉండకపోవచ్చని ఆయన వివరించారు. అంతేకాకుండా ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకూ ఇచ్చిన నియామక కట్టుబాట్లను గౌరవిస్తూ ఎవరైనా ఉద్యోగం మానేస్తే వారి ప్లేస్‌లో కొత్త నియామకాలు కూడా చేపట్టె అవకాశాల్లేవని మోహన్‌దాస్ పేర్కొన్నారు.
Tags: IT Jobs Hiring, Companies, salaries, mohandas pai, Infosys