మోహన్ బాబు వంట.. యమ టేస్టీ అంట..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన డైలాగ్ చెప్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తాడు అని కొందరు అంటే… ఆయన చెప్పే డైలాగ్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయని మరికొందరు చెబుతుంటారు. ఏ పాత్ర ఇచ్చినా సరే.. అవలీలగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మంత్రుగ్ధులను చేయగలడు. అయితే… తనలో మరో కోణం దాగి ఉందని ఈ మధ్యే తెలిసింది. టి. సుబ్బిరామి రెడ్డి కూతురు పింకీ రెడ్డి విసిరిన […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన డైలాగ్ చెప్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తాడు అని కొందరు అంటే… ఆయన చెప్పే డైలాగ్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయని మరికొందరు చెబుతుంటారు. ఏ పాత్ర ఇచ్చినా సరే.. అవలీలగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మంత్రుగ్ధులను చేయగలడు. అయితే… తనలో మరో కోణం దాగి ఉందని ఈ మధ్యే తెలిసింది. టి. సుబ్బిరామి రెడ్డి కూతురు పింకీ రెడ్డి విసిరిన చాలెంజ్ తో … మోహన్ బాబు గరిట తిప్పడంలోనూ నేర్పరి అని అభిమానులకు తెలిసిపోయింది.
అయితే తాజాగా పాక శాస్త్రం లో సరికొత్త ప్రయోగం చేశాడు మోహన్ బాబు. థాయ్, ఇండియన్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఓ సరికొత్త వంటకం చేశాడు. దీనికి ఖీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అని పేరు కూడా పెట్టాడు. భార్య, కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సమక్షంలో చేసిన ఈ వంటకం యమ్మీగా ఉందంటూ పోస్ట్ పెట్టింది లక్ష్మీ. మరి మోహన్ బాబు తయారు చేసిన ఈ వంటకం మీకూ నచ్చితే ఫాలో అయిపొండి.
Tags: Mohan Babu, Lakshmi Prasanna, Tollywood, Kitchen, Recipe