సీనియర్ బౌలర్లు రిటైర్ అయినా ఇబ్బంది ఉండదు : షమీ

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం ఎన్నడూ లేనంతా బలంగా ఉన్నదని.. బెంచ్ పైన కూడా నాణ్యమైన బౌలర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని సీనియర్ పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న సీనియర్ బౌలర్లు రిటైర్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని షమి పేర్కొన్నాడు. ఐపీఎల్ కోసం సిద్దపడుతున్న షమీ తాజాగా ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘టీమ్ ఇండియా సీనియర్ బౌలర్లు రిటైర్ అయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించడానికి […]

Update: 2021-04-01 11:36 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం ఎన్నడూ లేనంతా బలంగా ఉన్నదని.. బెంచ్ పైన కూడా నాణ్యమైన బౌలర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని సీనియర్ పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న సీనియర్ బౌలర్లు రిటైర్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని షమి పేర్కొన్నాడు. ఐపీఎల్ కోసం సిద్దపడుతున్న షమీ తాజాగా ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘టీమ్ ఇండియా సీనియర్ బౌలర్లు రిటైర్ అయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించడానికి యువ బౌలర్లు సిద్దంగా ఉంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిన వాళ్లు అలవాటు చేసుకుంటున్నారు. మేం రిటైర్ అయ్యే సమయానికి యువ ఆటగాళ్లు మరింతగా రాటు దేలుతారు’ అని షమీ వెల్లడించాడు. బయోబబుల్ వాతావరణం కారణంగా నెట్ బౌలర్లను తీసుకొని వెళ్లడం వల్ల చాలా లాభం చేకూరిందని షమి అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News