అంత ఈజీ కాదు కెప్టెన్ రోహిత్ శర్మ.. అజహరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ అనూహ్య నిర్ణయాలు టీమిండియా అభిమానులను షాక్‌కు గురిచేశాయి. బీసీసీఐ పెద్దల నిర్ణయంలో వన్డే, టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. తాను వన్డే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోనప్పటికీ బీసీసీఐ మాత్రం కోహ్లీని తప్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ క్రమంలో రోహిత్ నియామకంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ అనూహ్య నిర్ణయాలు టీమిండియా అభిమానులను షాక్‌కు గురిచేశాయి. బీసీసీఐ పెద్దల నిర్ణయంలో వన్డే, టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. తాను వన్డే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోనప్పటికీ బీసీసీఐ మాత్రం కోహ్లీని తప్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే, ఈ క్రమంలో రోహిత్ నియామకంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. సెలెక్షన్ కమిటీ మంచి నిర్ణయం తీసుకుందని అభినందించారు. ఈ సందర్భంగా భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. విరాట్ కోహ్లీ తర్వాత నూతన సారథిగా ఎంపికైన రోహిత్ శర్మపై భారీ ఆశలు, అంచనాలు ఉంటాయి. అలానే జట్టును నడిపించే సామర్థ్యం రోహిత్‌కు ఉందని నా నమ్మకం. కొత్త సారథికి శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు.