మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరిపై 8 ఏళ్ల నిషేధం
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇద్దరు క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధాన్ని విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. 2019లో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో యూఏఈకి చెందిన మహ్మద్ నవీద్, షైమన అన్వర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. అప్పట్లోనే వీరిపై ఆరోపణలు రావడంతో ఇద్దరిపై వెంటనే నిషేధం విధించారు. తాజాగా ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగం వారిపై ఆరోపించబడిన అభియోగాలు నిజమేనని […]
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇద్దరు క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధాన్ని విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. 2019లో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో యూఏఈకి చెందిన మహ్మద్ నవీద్, షైమన అన్వర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. అప్పట్లోనే వీరిపై ఆరోపణలు రావడంతో ఇద్దరిపై వెంటనే నిషేధం విధించారు. తాజాగా ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగం వారిపై ఆరోపించబడిన అభియోగాలు నిజమేనని తేల్చి చెప్పడంతో 8 ఏళ్ల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం 16 అక్టోబర్ 2019 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. యూఏఈకి చెందిన నవీద్ 39 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడటమే కాకుండా ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇక షైమన్ అన్వర్ 40 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.