‘పీఎం కేర్స్ ఫండ్’ ప్రభుత్వ పరిధిలో లేదు: పీఎంవో

న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరాడే ఉద్దేశంతో పెద్దమొత్తంలో విరాళాలు సేకరించిన పీఎం కేర్స్ ఫండ్.. ప్రభుత్వ పరిధిలో లేదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ముగ్గురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు ట్రస్టీలుగా, స్వయాన ప్రధాని ట్రస్ట్‌కు ఎక్స్ అఫీషియో చైర్మెన్‌గా ఉన్న ఈ పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలో లేదని ప్రకటించడం గమనార్హం. పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించిన సమాచారం వెల్లడించాలని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టూడెంట్ హర్ష కందుకూరి ఆర్టీఐ దాఖలు చేశారు. దీనికి సమాధనంగా […]

Update: 2020-05-31 06:58 GMT

న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరాడే ఉద్దేశంతో పెద్దమొత్తంలో విరాళాలు సేకరించిన పీఎం కేర్స్ ఫండ్.. ప్రభుత్వ పరిధిలో లేదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ముగ్గురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు ట్రస్టీలుగా, స్వయాన ప్రధాని ట్రస్ట్‌కు ఎక్స్ అఫీషియో చైర్మెన్‌గా ఉన్న ఈ పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలో లేదని ప్రకటించడం గమనార్హం. పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించిన సమాచారం వెల్లడించాలని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టూడెంట్ హర్ష కందుకూరి ఆర్టీఐ దాఖలు చేశారు. దీనికి సమాధనంగా ఆర్టీఐ 2005లోని సెక్షన్ 2(హెచ్) ప్రకారం ఈ నిధి పబ్లిక్ అథారిటీగా పరిగణించలేమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కరోనాపై పోరులో భాగంగా ఈ నిధిని మార్చి 28న ఏర్పాటు చేశారు. కొన్ని రిపోర్టుల ప్రకారం పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌లు ట్రస్టు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ విషయమై ఆర్టీఐ దాఖలు చేసిన హర్ష మాట్లాడుతూ, ఈ సమాచారాన్ని నిరాకరిండచమంటే పారదర్శకతను నిరాకరించడమేనని, సమాచార హక్కను కాలరాయడమేనని ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్‌ పేరు, ఎంబ్లం, ప్రభుత్వ డొమైన్ నేమ్, ట్రస్టు సభ్యులు, నియంత్రణలాంటి విషయాలన్నీ ఇది ప్రభుత్వ నిధి అనే సూచిస్తున్నాయని తెలిపారు. ఈ నిధికి సంబంధించి నిర్ణయాలపై నియంత్రణ, అధికారాలు ఎవరికి ఉన్నాయో తెలియడం లేదని, ఈ పేరుతో సేకరించిన పెద్దమొత్తాన్ని ఎలా వినియోగించనున్నారో అనే విషయమూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. ‘ప్రధాని జాతీయ సహాయక నిధి’(పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్) ఉండగా, పీఎం కేర్స్ ఫండ్ అవసరమేంటని ప్రతిపక్షాలు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News