బేడ బుడగ జంగాలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : బేడ బుడగ జంగాల రాష్ట్ర జేఏసీ నాయకుడు చింతల యాదగిరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నాయకులు పాసర్లపూడి లక్ష్మి, మోటం ప్రభాకర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బేడ బుడగ జంగాలకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ […]

Update: 2021-11-16 05:04 GMT

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : బేడ బుడగ జంగాల రాష్ట్ర జేఏసీ నాయకుడు చింతల యాదగిరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నాయకులు పాసర్లపూడి లక్ష్మి, మోటం ప్రభాకర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బేడ బుడగ జంగాలకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో కడమంచి యాదగిరి, ఎం. బాలకృష్ణ, ఎం. ప్రకాష్, ఎం నరేష్, జంగయ్య, వంశీ, హరిబాబు, మనోహర్, బాబు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..