మిర్యాలగూడలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు…
దిశ, మిర్యాలగూడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. డివిజన్ వ్యాప్తంగా ఉన్న పది మండలాల పరిధిలో 191 ఓట్లకు గాను 189 ఓట్లు పోలయ్యాయని, 98.95% శాతం పోలింగ్ నమోదైనట్లు సెక్టోరియల్ అధికారి కె ఎం వీ జగన్నాధ రావు తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, […]
దిశ, మిర్యాలగూడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. డివిజన్ వ్యాప్తంగా ఉన్న పది మండలాల పరిధిలో 191 ఓట్లకు గాను 189 ఓట్లు పోలయ్యాయని, 98.95% శాతం పోలింగ్ నమోదైనట్లు సెక్టోరియల్ అధికారి కె ఎం వీ జగన్నాధ రావు తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్ లు తమ తమ నియోజకవర్గ పరిధిలో ని ఎంపీటీసీలతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మిగతా ప్రజా ప్రతినిధులు వరుస క్రమంలో తమ ఓటు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటి రెడ్డి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటి రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ నిగిడాల సురేష్ ప్రత్యేక బందోబస్తు చేపట్టగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.