2008 నుంచి కొనసాగుతున్న కళాశాల పనులు.. ఎమ్మెల్సీ ఆగ్రహం
దిశ, ఇబ్రహీంపట్నం: వినోబానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2008లో ప్రారంభించిన డిగ్రీ కళాశాల ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. దీంతో ఇటు ఇంటర్ విద్యార్థులకు అటు డిగ్రీ విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, పనులు […]
దిశ, ఇబ్రహీంపట్నం: వినోబానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2008లో ప్రారంభించిన డిగ్రీ కళాశాల ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. దీంతో ఇటు ఇంటర్ విద్యార్థులకు అటు డిగ్రీ విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు.
వెంటనే నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో తెలంగాణ పౌర స్పందన జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అజ్మత్ ఖాన్, జిల్లా నాయకులు కోట, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డివిజన్ కార్యదర్శి జగన్, మండల కార్యదర్శి చరణ్, నాయకులు రాఘవేందర్, ఉదయ్, వినోద్, తరంగ్, చిరు, తరుణ్, మనీష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.