మంత్రి ఎదుటే అదనపు కలెక్టర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్సీ (వీడియో)

దిశ ప్రతినిధి, రంగారెడ్డి, తాండూర్: వికారాబాద్​జిల్లా తాండూర్​నియోజకవర్గంలోని 124 గ్రామాలకు ప్రభుత్వం దోమల నివారణ యంత్రాల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమం తాండూర్​మున్సిపాలిటీ పరిధిలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రజలు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాండూర్​పట్టణంలోని 11 వార్డు పరిధిలో పంపిణీ కార్యక్రమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని వేదికపైకి మున్సిపల్​చైర్మన్, ఎంపీపీలను ఆహ్వానించారు. అయితే స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి ఆందోళన చేసింది. నా […]

Update: 2021-12-10 10:19 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి, తాండూర్: వికారాబాద్​జిల్లా తాండూర్​నియోజకవర్గంలోని 124 గ్రామాలకు ప్రభుత్వం దోమల నివారణ యంత్రాల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమం తాండూర్​మున్సిపాలిటీ పరిధిలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రజలు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాండూర్​పట్టణంలోని 11 వార్డు పరిధిలో పంపిణీ కార్యక్రమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని వేదికపైకి మున్సిపల్​చైర్మన్, ఎంపీపీలను ఆహ్వానించారు. అయితే స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి ఆందోళన చేసింది. నా ప్రాంతంలో సమావేశం నిర్వహించి తనను వేదికపైకి ఆహ్వానించకుండా అవమానానికి గురిచేశారని నెలపై కూర్చోని నిరసన చేసింది.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తమకు అనుకూలమైన కౌన్సిలర్ అనే కారణంగానే అవమానానికి గురిచేశారని అగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహంతో అధికారులపై, ఎమ్మెల్యేపై నోరుపారెసుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి కూర్చిలోంచి లేస్తూనే ఎడవ వైపు కూర్చున్న అదనపు కలెక్టర్‌పై చేయి చేసుకున్నారు. అంతేగాకుండా.. ఆ సభ వేదికపైనున్న ఎమ్మెల్యే, ఆర్డీవోలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలుగచేసుకొని స్థానిక కౌన్సిలర్‌ను వేదికపైకి పిలిపించి కూర్చోబెట్టడంతో వివాదం సమిసిపోయింది.

Tags:    

Similar News