నిండు గర్భిణికి ఎమ్మెల్సీ కవిత అండ
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కొస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కొస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతి బాయి మరిది ట్విట్టర్ లో సహాయం కోసం అభ్యర్థించాడు. మనసున్న కొంతమంది మంచి మనుషులు స్పందించారు. కొంత మొత్తం జమైంది. కాని ఆపరేషన్ ఖర్చుకు అది ఎంత మాత్రం సరిపోదు. మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
అయితే జ్యోతి బాయి గురించి ఎమ్మెల్సీ కవిత కు తెలియడంతో ఆ కుటుంబానికి ఓదార్పు దక్కింది. జ్యోతి బాయి ఆపరేషన్ ఖర్చును భరిస్తానని ఎమ్మెల్సీ కవిత హామి ఇచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ ఈ రోజు పూర్తైంది. దీంతో ఆమె పండండి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ఎమ్మెల్సీ కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన సహాయంతో జ్యోతిబాయి భర్త, మరిది చలించిపోయారు. కవిత గారి స్పూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేస్తామని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్‌లు ఇక నుంచి తాము గర్భిణీలను ఉచితంగా హాస్పిటల్స్ కు తీసుకుపోతామని ప్రకటించారు.