ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దుబాయ్ పర్యటనకు వెళ్లారు. శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్ పైన బతుకమ్మ ప్రదర్శన ఉండటంతో ప్రజాప్రతినిధులు దుబాయ్‌కు చేరుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా , జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్ (జగిత్యాల)లు ఉన్నారు. వీరికి దుబాయ్‌లో నివసిస్తున్న ప్రవాస […]

Update: 2021-10-23 09:58 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దుబాయ్ పర్యటనకు వెళ్లారు. శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్ పైన బతుకమ్మ ప్రదర్శన ఉండటంతో ప్రజాప్రతినిధులు దుబాయ్‌కు చేరుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా , జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్ (జగిత్యాల)లు ఉన్నారు.

వీరికి దుబాయ్‌లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ బిడ్డలు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు, జాగృతి ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించి రాష్ట్ర పండుగ బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటేందుకు ఈ కార్యక్రమానికి ఎంచుకున్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..