నేతలను హైదరాబాద్కు పిలిపించుకుని కవిత భేటీ.. ఆ అంశంపైనే చర్చ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమె చర్చించారు. రెండోసారి […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమె చర్చించారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత వెంటనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించారు.