జెడ్పీ చైర్మన్ పదవి నుంచి పుట్ట మధును తొలగించాలి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పుట్ట మధు అవినీతి, అక్రమాలను వెలికి తీసినందుకే న్యాయవాదుల హత్యలు జరిగాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి హత్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఉన్నాయని, దీనిని ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, బీజేపీ ఇతర పార్టీలు హత్యలను ఖండిస్తుంటే టీఆర్ఎస్ […]

Update: 2021-03-01 03:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పుట్ట మధు అవినీతి, అక్రమాలను వెలికి తీసినందుకే న్యాయవాదుల హత్యలు జరిగాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి హత్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఉన్నాయని, దీనిని ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, బీజేపీ ఇతర పార్టీలు హత్యలను ఖండిస్తుంటే టీఆర్ఎస్ నాయకులు హత్యలను ఖడించకపోవడం దారుణమన్నారు.

పుట్ట మధుకు సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్ అవినీతిని బయటపెట్టినందునే ఈ హత్యలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బిట్టు శీను, కుంట శీనులను నిందితుడుగా చూపిస్తూ అసలు నిందితులను పోలీసులు వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు పూర్తిగా అధికారపార్టీ తొత్తులుగా మారారని న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం లేకుండా పోయిందన్నారు. పుట్ట మధును వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News