ఆ స్థలాన్ని ఆక్రమిస్తే తరిమికొడతాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, జగిత్యాల: జిల్లాలోనే ఘన చరిత్ర కలిగిన పురాతన(ఓల్డ్) పాఠశాల ఆవరణలో షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు బల్దియా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే పాఠశాలకు వెళ్ళి సర్వే చేయించి, నిర్మాణానికి కావాల్సిన 5 గుంటల 47 గజాల స్థలాన్ని వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు లేఖ కూడా అందింది. పాఠశాల స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే, ముందుగా విద్యావిభాగం అధిపతి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎలాంటి అనుమతులు […]

Update: 2021-12-15 08:55 GMT

దిశ, జగిత్యాల: జిల్లాలోనే ఘన చరిత్ర కలిగిన పురాతన(ఓల్డ్) పాఠశాల ఆవరణలో షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు బల్దియా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే పాఠశాలకు వెళ్ళి సర్వే చేయించి, నిర్మాణానికి కావాల్సిన 5 గుంటల 47 గజాల స్థలాన్ని వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు లేఖ కూడా అందింది. పాఠశాల స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే, ముందుగా విద్యావిభాగం అధిపతి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం ముందుకెళ్తున్నారు. గతంలో జిల్లాలో పలు పాఠశాలల్లో నిర్మాణాలు చేపడితే కూల్చేసిన సంఘటనలు ఉన్నా కూడా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారుల మొండిగా వ్యవహరిస్తూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సరికాదని వేడుకుంటున్నారు.

జిల్లా కేంద్రంలోని పురాతన(ఓల్డ్) పాఠశాలలోని గ్రౌండ్‌లో బుధవారం అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో పాఠశాల గ్రౌండ్‌లో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అంతేగాకుండా.. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఈ స్కూల్ స్థలం మీ జాగిరా? అంటూ అధికారులపై ధ్వజమెత్తారు. స్కూల్ ఆక్రమిస్తే ఇక్కడే ఉండి తరిమికొడతామని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News