కలెక్టర్‌కు విధించిన శిక్ష కేసీఆర్‌కు పడినట్లే : జీవన్ రెడ్డి
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల కలెక్టర్‌కు కోర్టు వేసిన జైలు శిక్ష సీఎం కేసీఆర్‌కు విధించినట్టు భావించొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు కలెక్టర్లకు హైకోర్టు జైలు శిక్ష విధించడాన్ని చూస్తే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో అర్థమవుతున్నదన్నారు. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా పని చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతగిరి […]
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల కలెక్టర్‌కు కోర్టు వేసిన జైలు శిక్ష సీఎం కేసీఆర్‌కు విధించినట్టు భావించొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు కలెక్టర్లకు హైకోర్టు జైలు శిక్ష విధించడాన్ని చూస్తే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో అర్థమవుతున్నదన్నారు.
అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా పని చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించాల్సి ఉన్నా సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మంథనిలో న్యాయవాదుల హత్యకు సంబంధించి కేవలం మండల అధ్యక్షుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి టీఆర్ఎస్ చేతులు దులుపుకుందని ఆరోపించారు. హత్యలతో సంబంధం ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.