ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
దిశ, డైనమిక్ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం పూర్తి కావడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఈసీ ఆదివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, నవంబరు 9న నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబరు 29న పోలింగ్ నిర్వహిస్తామని అదే రోజున ఓట్ల లెక్కింపు […]
దిశ, డైనమిక్ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం పూర్తి కావడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఈసీ ఆదివారం విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, నవంబరు 9న నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబరు 29న పోలింగ్ నిర్వహిస్తామని అదే రోజున ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ఈసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అయితే, జూన్ 3న ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తైంది. వారిలో ఆకుల లలిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, మొహమ్మద్ ఫరీదుద్దీన్, bodakunti వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి ఉన్నారు. ఈ ఆరు స్థానాలకు టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.