ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి

దిశ, న‌ల్ల‌గొండ‌: న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌భుత్వ ఆసుపత్రిలోని ఐసోలేష‌న్‌, ఈహెచ్ఎస్ ఆసుప‌త్రుల‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి న‌ర్సింహారెడ్డి సోమ‌వారం త‌నిఖీ చేశారు. కోవిడ్‌-19 అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉన్నసౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. వారికి అందుతున్న వైద్య సేవ‌ల గురించి అక్క‌డ ఉన్న రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా నియంత్ర‌ణ కోసం త‌మ ప్రాణాలను ప‌ణంగా పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నిజమైన దేవుళ్లు అని కొనియాడారు. […]

Update: 2020-03-30 03:24 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌: న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌భుత్వ ఆసుపత్రిలోని ఐసోలేష‌న్‌, ఈహెచ్ఎస్ ఆసుప‌త్రుల‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి న‌ర్సింహారెడ్డి సోమ‌వారం త‌నిఖీ చేశారు. కోవిడ్‌-19 అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉన్నసౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. వారికి అందుతున్న వైద్య సేవ‌ల గురించి అక్క‌డ ఉన్న రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా నియంత్ర‌ణ కోసం త‌మ ప్రాణాలను ప‌ణంగా పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నిజమైన దేవుళ్లు అని కొనియాడారు. రోజు వారిగా పారిశుధ్య ప‌నులు నిర్వ‌హిస్తున్న శానిటేష‌న్ సిబ్బంది, పోలీసులు, జ‌ర్న‌లిస్టులు చేస్తోన్న సేవ‌కు యావ‌త్ స‌మాజం వారికి రుణ‌ప‌డి ఉంటుంద‌న్నారు. ఆత‌రువాత ఈహెచ్ఎస్
ఆసుప‌త్రిని ప‌రిశీలించి ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల గురించి వాక‌బు చేశారు. అన్ని ర‌కాల జ‌బ్బుల‌కు మందులు అందుబాటులో ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఎంహెచ్‌వోను కోరారు. ఆయ‌న వెంట టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయ‌కులు ఎడ్ల సైదులు, కోరి వెంక‌టేశం, వెంక‌న్న త‌దితరులు ఉన్నారు.

tags : MLC narsireddy, checks, hospital, nalgonda

Tags:    

Similar News