ఆవేశంతో మాట్లాడి పొరపాటు చేశా !

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తా.. ఒకేసారి ప్రజలు నాదగ్గరకు వచ్చేసరికి ఆవేశంతో ఫోన్‌‌లో మాట్లాడి పొరపాటు చేశానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అంగీకరించారు. వీఆర్వోతో ఫోన్ సంభాషణ విషయంలో నెలకొన్న వివాదంపై బుధవారం రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆవేశంలో పొరపాటు చేశానని, ఎవరూ బాధపడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి, సీఎం కేసీఆర్ ఆదేశాల […]

Update: 2020-10-07 09:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తా.. ఒకేసారి ప్రజలు నాదగ్గరకు వచ్చేసరికి ఆవేశంతో ఫోన్‌‌లో మాట్లాడి పొరపాటు చేశానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అంగీకరించారు. వీఆర్వోతో ఫోన్ సంభాషణ విషయంలో నెలకొన్న వివాదంపై బుధవారం రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆవేశంలో పొరపాటు చేశానని, ఎవరూ బాధపడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్నారని కొనియాడారు. వారితో నాకెప్పుడూ భేదాభిప్రాయాలు లేవన్నారు. వీఆర్వో శ్యామ్ కుమార్, తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, మిగతా రెవెన్యూ సోదరులకు ప్రభుత్వ భూముల రక్షణలో పూర్తిగా సహకరిస్తానన్నారు.

Tags:    

Similar News