జనగామ జిల్లాలో తెలంగాణ తిరుపతి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజీఎఫ్ నిధులతో అతిథి గృహం, కొండపైకి మెట్లు, భక్తులకు టాయిలెట్స్, వసతి గృహాల నిర్మాణం […]

Update: 2021-08-29 06:24 GMT

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజీఎఫ్ నిధులతో అతిథి గృహం, కొండపైకి మెట్లు, భక్తులకు టాయిలెట్స్, వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నట్లు రాజయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం ప్రగతి మార్గంలో ఉందన్నారు. పదవులు ఉన్నా.. లేకున్నా నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరు పాలుపంచుకున్నా.. అది తన ఖాతాలోనే జమ అవుతుందన్నారు. కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రశంసించారు.

Tags:    

Similar News