వారిపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. ప్రభుత్వానికి శ్రీధర్ బాబు వార్నింగ్

దిశ, భూపాలపల్లి: గిరిజనులు, ఆదివాసీలు గత 30 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. భూపాల్‌పల్లి జిల్లాలోని పలు గిరిజనులు, ఆదివాసీలు ఆ భూములనే నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. 1960కి సంబంధించిన మ్యాప్‌ను పట్టుకుని అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేసి లాక్కుంటున్నారని ఆరోపించారు. గిరిజనులు పండించిన పంటను నాశనం చేసి, […]

Update: 2021-09-19 02:53 GMT

దిశ, భూపాలపల్లి: గిరిజనులు, ఆదివాసీలు గత 30 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. భూపాల్‌పల్లి జిల్లాలోని పలు గిరిజనులు, ఆదివాసీలు ఆ భూములనే నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. 1960కి సంబంధించిన మ్యాప్‌ను పట్టుకుని అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేసి లాక్కుంటున్నారని ఆరోపించారు. గిరిజనులు పండించిన పంటను నాశనం చేసి, వారికి నష్టం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, నేడు ఆ భూములను సైతం ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం దారుణం అన్నారు. ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో అనేకసార్లు ముఖ్యమంత్రికి వివరించామని, అయినా వారిపై దాడులు ఆగడం లేదని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఆదివాసీ, గిరిజనులకు భూములపై హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News