ప్రభుత్వ భూముల్లో మొక్కలు ఎందుకు నాటడం లేదు : సీతక్క ఫైర్

దిశ ,తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన‌లో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ పోడు భూముల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చ జరగాలనే తీర్మానాన్ని తిరస్కరించడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆత్మగౌరవం లభించడం లేదన్నారు. ఏడేళ్ల కింద పట్టాలు ఇస్తామని చెప్పిన సర్కార్, ఇప్పుడు ఢిల్లీ చేతుల్లో ఉన్నదని దాట వేస్తున్నారన్నారు. గతంలో […]

Update: 2021-10-05 04:26 GMT

దిశ ,తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన‌లో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ పోడు భూముల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చ జరగాలనే తీర్మానాన్ని తిరస్కరించడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆత్మగౌరవం లభించడం లేదన్నారు. ఏడేళ్ల కింద పట్టాలు ఇస్తామని చెప్పిన సర్కార్, ఇప్పుడు ఢిల్లీ చేతుల్లో ఉన్నదని దాట వేస్తున్నారన్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా ప్రతి జిల్లాల వారీగా మంత్రులు పర్యటించి ఆదివాసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఏళ్ళు గడుస్తున్నా పరిష్కారం కాలేదన్నారు. పట్టాల కోసం రెండు లక్షల మంది ఆదివాసీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా, కేవలం 90 వేల దరఖాస్తులు మాత్రమే పరిశీలన చేసినట్టు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మిగతా లక్షా పదివేల దరఖాస్తులు ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. వెంటనే అప్లికేషన్‌లను పరిశీలించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.

ప్రజా సమస్యలపై మైక్ ఇవ్వడం లేదు : ఎమ్మెల్యే సీతక్క

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదివాసీలను అడుగడుగున తొక్కేస్తున్నారాని పేర్కొన్నారు. హరితహారం పేరిట ఆదివాసుల భూములను గుంజుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఎన్నో ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నా, అక్కడ మొక్కలు నాటకుండా ఆదివాసులకు, ఉపాధి కల్పిస్తున్న భూములను తీసుకోవడం ఏమిటని అడిగారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. 76% అడవులు ఉన్న ములుగు జిల్లా‌లో కూడా భూముల లాకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడెం వీరయ్య మాట్లాడుతూ.. ఆదివాసులకు అన్యాయం చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సూచించారు. ఎన్నో ఏరియాల్లో ప్రభుత్వ భూములు ఉన్న కేవలం ఆదివాసి భూములలో హరితహారం పేరిట మొక్కలు వేయడం దారుణం అన్నారు.

Tags:    

Similar News