మేడారం జాతరకు రూ. 112 కోట్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే సీతక్క

దిశ, ములుగు: వచ్చే ఏడాది మేడారం జాతరకు రూ. 112 కోట్లు కేటాయించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క, పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మంకిడి బుచ్చయలు కోరారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసిన వారు.. మేడారం జాతర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారంకు వచ్చే ఏడాది సుమారు కోటి మంది వచ్చే అవకాశం ఉందన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల నుంచి మేడారం జాతర అభివృద్ధికి […]

Update: 2021-10-06 09:13 GMT

దిశ, ములుగు: వచ్చే ఏడాది మేడారం జాతరకు రూ. 112 కోట్లు కేటాయించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క, పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మంకిడి బుచ్చయలు కోరారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసిన వారు.. మేడారం జాతర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారంకు వచ్చే ఏడాది సుమారు కోటి మంది వచ్చే అవకాశం ఉందన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల నుంచి మేడారం జాతర అభివృద్ధికి సుమారు రూ. 112 కోట్లతో ప్రణాళిక రూపొందించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని.. ఈ నేపథ్యంలోనే సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ. 111 కోట్ల 91 లక్షల నిధులు తక్షణమే కేటాయించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సీతక్క సీఎస్‌ను కోరారు.

Tags:    

Similar News