అయోధ్య రామమందిరం విరాళాలపై BJP vs TRS

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కాషాయం పార్టీ దేశవ్యాప్తంగా చందాలు సేకరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామమందిరం నిర్మాణం పేరిట బీజేపీ నాయకులు బిక్షమెత్తుకుంటున్నారని కామెంట్స్ చేశారు. దీంతో మరో కొత్త రాజకీయ నాటకానికి తెరలేపారని విమర్శించారు. బొట్టుపెట్టుకుంటేనే భక్తులవుతారా..? తామంతా రాముడి భక్తులమేనని వెల్లడించారు. యూపీలో […]

Update: 2021-01-21 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కాషాయం పార్టీ దేశవ్యాప్తంగా చందాలు సేకరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామమందిరం నిర్మాణం పేరిట బీజేపీ నాయకులు బిక్షమెత్తుకుంటున్నారని కామెంట్స్ చేశారు. దీంతో మరో కొత్త రాజకీయ నాటకానికి తెరలేపారని విమర్శించారు. బొట్టుపెట్టుకుంటేనే భక్తులవుతారా..? తామంతా రాముడి భక్తులమేనని వెల్లడించారు. యూపీలో ఉన్న ఆ రాముడు మనకెందుకు మన గ్రామాల్లోనూ రాముడు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయానికి చందాలు ఎవరూ ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ :

కోరుట్ల ఎమ్మెల్యే కామెంట్స్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరనీ చందాలు ఇవ్వండని బలవంతం చేయడం లేదని.. ఎవరికి తోచినంత వారు చందాలు ఇవ్వాలని కోరతున్నట్లు చెప్పారు. ఓ వైపు అయోధ్య రామ మందిరం నిర్మాణంకోసం ఉద్యమంలా చందాల సేకరణ జరుగుతుంటే విరాళాలు ఇవ్వొద్దని అడ్డుకుంటారా అని రాజాసింగ్ మండిపడ్డారు. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు.

Tags:    

Similar News