కేసీఆర్ నీ చిత్తశుద్దిని చాటుకో..
దిశ, దుబ్బాక : ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక నుండి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దళిత బంధు కోసం నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి దళిత బంధు సాధనకై దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాగైతే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్టుగానే, దుబ్బాక నియోజక వర్గంలో విద్యనభ్యసించి ఇక్కడి ప్రాంతంలో […]
దిశ, దుబ్బాక : ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక నుండి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దళిత బంధు కోసం నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి దళిత బంధు సాధనకై దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాగైతే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్టుగానే, దుబ్బాక నియోజక వర్గంలో విద్యనభ్యసించి ఇక్కడి ప్రాంతంలో పెరిగిన వ్యక్తిగా కేసీఆర్ దుబ్బాకలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించే విధంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు.
దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దుబ్బాక నియోజకవర్గం నుండి దళిత బందును అమలు చేసి, ఇక్కడి దళితులకు న్యాయం చేయాలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పై గళం విప్పి కొట్లాడుతానని తెలిపారు. అదే రోజు ట్యాంకు బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి అసెంబ్లీ వరకు నడిచి దళితుల కోసం గర్జిస్తామన్నారు. అందుకు దళితులంతా మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో, మండలాల్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలపాలని దళితులకు పిలుపునిచ్చారు. అంతకుముందు దుబ్బాక లోని ప్రధాన వీధుల గుండా దళిత బంధు సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దీక్షకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ప్రమాదకరమైన మోసకారి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం కలిపి లక్షా యాభై వేల కోట్లు అయితే కేవలం దళిత బంధుకు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు. మరి ఎక్కడ నుండి తీసుకు వస్తారని ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగిన అని చెప్పుకునే చింత మడకకు ఇంటికి పది లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తే మరి రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు.
మల్లన్నసాగర్ లో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు కాని నీ ఊరిలో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారని ప్రశ్నించారు. కేవలం చింతమడక గ్రామస్తులు ఓటేస్తేనే గెలిచారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్నో అబద్ధాలు చెప్పే కేసీఆర్ మాటలను ఇక ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మచ్చ శ్రీనివాస్ బీజేపీ లో చేరారు.