చేతగాని నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
దిశ శంషాబాద్ : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనే వరకు ఆందోళనలు చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహించి, తహసీల్దార్ జనార్థన్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాటిని కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం కొనకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లడం ఎంతవరకు […]
దిశ శంషాబాద్ : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనే వరకు ఆందోళనలు చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహించి, తహసీల్దార్ జనార్థన్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాటిని కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం కొనకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లడం ఎంతవరకు సమంజసమన్నారు.
జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి రైతులను మోసం చేశారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అవసరమైతే రైతుల పక్షాన ఉండి ఢిల్లీలో ఆందోళన కూడా చేస్తామన్నారు. చేతగాని పనికిరాని నాయకులు కొందరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తిరగబడితే రోడ్లపై తిరగ లేరని హెచ్చరించారు.