టార్గెట్ ‘పెద్ది’.. స్కెచ్ గీసిన మంత్రి ఎర్రబెల్లి

దిశప్రతినిధి, వ‌రంగ‌ల్ : న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డిని టీఆర్ఎస్‌లోని కొంత‌మంది ముఖ్య నేత‌లు, ప్రజాప్రతినిధులు టార్గెట్ చేసేశారా..? ఇంటి నుంచి స‌హ‌కారం అందించ‌కుండా.. బ‌య‌ట నుంచి వ్యతిరేక‌త అనే నినాదంతో ఎమ్మెల్యేకు ఇబ్బందులు క‌లిగించే ప‌రిణామాలు జ‌రుగుతున్నాయా…? అంటే ఖ‌చ్చితంగా అవున‌నే చెప్పాలి. సీఎం ప‌ర్యట‌న‌లో సెగ పుట్టించే రాజ‌కీయ ప‌రిణామాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే, ఇందులో పెద్దిలో ఆగ్రహావేశాల‌ను చూస్తున్న అధిష్ఠానం తెర‌వెనుక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని […]

Update: 2021-06-26 22:25 GMT

దిశప్రతినిధి, వ‌రంగ‌ల్ : న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డిని టీఆర్ఎస్‌లోని కొంత‌మంది ముఖ్య నేత‌లు, ప్రజాప్రతినిధులు టార్గెట్ చేసేశారా..? ఇంటి నుంచి స‌హ‌కారం అందించ‌కుండా.. బ‌య‌ట నుంచి వ్యతిరేక‌త అనే నినాదంతో ఎమ్మెల్యేకు ఇబ్బందులు క‌లిగించే ప‌రిణామాలు జ‌రుగుతున్నాయా…? అంటే ఖ‌చ్చితంగా అవున‌నే చెప్పాలి. సీఎం ప‌ర్యట‌న‌లో సెగ పుట్టించే రాజ‌కీయ ప‌రిణామాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే, ఇందులో పెద్దిలో ఆగ్రహావేశాల‌ను చూస్తున్న అధిష్ఠానం తెర‌వెనుక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న అనుచ‌రులు గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యవ‌స్థాపితం నుంచి పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి పార్టీలో ప‌నిచేస్తున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఓ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టిన ఘ‌న‌త ఆయ‌న‌ద‌ని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఉద్యమ నేత‌గా రాష్ట్ర ప్రజానీకం మ‌దిలో పేరు సంపాదించుకున్న ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఎదురుదెబ్బలు మాత్రం త‌ప్పలేదు. అయితే, పెద్ది సుద‌ర్శన్‌రెడ్డిపై కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. పార్టీకి బ‌ల‌మ‌వుతున్నాడ‌ని ఎన్నో వేదిక‌ల‌పై, నాయ‌కుల అంత‌ర్గత స‌మావేశాల్లో కొనియాడాడ‌ని పెద్ది అనుచ‌రులు గుర్తు చేస్తున్నారు. కానీ, అలాంటి నేత‌కే ఇప్పుడు అధిష్ఠానం నుంచి స‌హ‌కారం అంద‌క పోగా, వ్యతిరేక స్వరం స‌ల‌హాలు, సూచ‌న‌లు వినిపిస్తుండ‌టం పెద్దికి మింగుడు ప‌డ‌టం లేద‌ని స‌మాచారం.

అపాయింట్‌మెంట్ ఇవ్వని కేటీఆర్‌..

సీఎం వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌లో పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి వాహ‌నాన్ని పోలీసులు అడ్డుకోవ‌డంతో అందుకు నిర‌స‌న‌గా మంత్రి ఎర్రబెల్లి నివాస‌ముంటున్న ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వ‌ర‌కు పాద‌యాత్రగా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పెద్ది ఎర్రబెల్లిని ఉద్దేశించి చేసిన కామెంట్ల వీడియో కూడా వైర‌ల్‌గా మారింది. కాగా, పెద్ది ఆగ్రహావేశాల వెనుక మాత్రం క‌న‌బ‌డ‌ని రాజ‌కీయ ఒత్తిళ్లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. త‌న‌ను అణిచివేయాల‌ని ఓ మంత్రిపై ఉన్న కోపాన్నే బ‌హిర్గతం చేశారని తెలుస్తోంది. త‌న‌కోప‌మే త‌న శ‌త్రువు అన్నట్లుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి కోపం ఆయ‌న‌కే ఇబ్బందులు తెచ్చింది. కేసీఆర్ కుటుంబంలోని ఓ నేత ఫోన్ చేసి మ‌రీ ఎవ‌రి మీద నీ కోపం.. సీఎంపైనా అంటూ గ‌ట్టిగానే మంద‌లించిన‌ట్లు స‌మాచారం. కోప‌మో, మ‌న‌స్తాప‌మో తెలియ‌దు గానీ పెద్ది సీఎం ప‌ర్యట‌న‌లో పాల్గొన‌కుండానే ఇంటికి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత రోజే హైద‌రాబాద్ వెళ్లి కేటీఆర్‌ను వెళ్లి క‌లిసే ప్రయ‌త్నం చేసినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేద‌ని స‌మాచారం.

నియోజ‌క‌వ‌ర్గంలో పుల్లలు..

న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ నేత‌ దొంతి మాధ‌వ‌రెడ్డి, బీజేపీలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డిల‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చి పెద్ది ప్రాధాన్యం త‌గ్గించేందుకు మంత్రి ఎర్రబెల్లి కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. టీడీపీలో ఎర్రబెల్లి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు సుదీర్ఘకాలం ప‌నిచేశారు. ఇద్దరి మ‌ధ్య మంచి మైత్రి బంధం ఉంది. అలాగే ఉద్యమ స‌మ‌యంలో ఎర్రబెల్లికి పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి అస్సలు ప‌డేది కాదు. ఎర్రబెల్లి పార్టీలోకి వ‌చ్చాకా.. కూడా పెద్దికి ఆయ‌న‌కు పొస‌గ‌డం లేద‌ని చాలా కాలంగా పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. పెద్ది ఒంటెద్దు పొక‌డ‌ల‌తో న‌ర్సంపేటలో పార్టీకి న‌ష్టం క‌లుగుతోంద‌ని కొంత‌మంది గ‌తంలో నేరుగా కేటీఆర్‌ను క‌లిసి ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప‌రిణామాల వెనుక మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక హ‌స్తం నేత‌, క‌మ‌లం పార్టీ నేత ప్రొద్బలం, వ్యూహాలున్నాయ‌ని పెద్ది అనుచ‌రులు పేర్కొంటున్నారు..

Tags:    

Similar News