అందరి సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
దిశ, భువనగిరి రూరల్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హులైన 14 మందికి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం ప్రజలతో ఉంటుందని, అందరూ మాస్క్ పెట్టుకుంటూ, సామాజిక దూరం పాటించాలని […]
దిశ, భువనగిరి రూరల్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హులైన 14 మందికి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం ప్రజలతో ఉంటుందని, అందరూ మాస్క్ పెట్టుకుంటూ, సామాజిక దూరం పాటించాలని అన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకొని.. జాగ్రత్తలు పాటించడమే మనకు శ్రీరామరక్ష అని తెలిపారు. అంతేగాకుండా.. మండల కేంద్రంలో ఉన్నటువంటి 108 అంబులెన్స్‌కు సంబంధించిన ఖర్చులు, అంబులెన్స్ సిబ్బంది జీతభత్యాలు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ తమ వినతిపత్రాలు ఎమ్మెల్యేకు అందజేయడంతో అన్ని సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ బోళ్ల లలిత, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.