వ్యాక్సిన్ దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

దిశ, వెబ్‌డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. సేవాభావంతో ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి బాలకృష్ణ నివాళులు […]

Update: 2021-01-26 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. సేవాభావంతో ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. మన దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ విదేశాల్లోని ప్రజలకు ఉపయోగపడటం గర్వకారణమని బాలకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని వివరించారు.

Tags:    

Similar News