ఎమ్మెల్సీ గారూ.. ఎమ్మెల్యేని విమర్శించడం తగునా..?

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం ఎమ్మెల్యే, టిపిసిసి ఉపాధ్యక్షులు పొదెం వీరయ్యని, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించడం ఎంతమాత్రం తగదని కాంగ్రెస్ పార్టీ భద్రాచలం టౌన్ అధ్యక్షుడు సరెళ్ళ నరేష్ అన్నారు. భద్రాచలం అభివృద్ధికి అనుక్షణం పొదెం వీరయ్య కృషిచేస్తున్నారని తెలిపారు.‌ భద్రాచలం సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయించామని ఎమ్మెల్సీ బాలసాని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హైవే‌కి సంబంధించిన పనులకు భద్రాచలం గ్రామపంచాయతీ నిధులు ఖర్చు చేయడం నిజంగా దౌర్భాగ్యం అన్నారు. […]

Update: 2021-10-23 12:02 GMT

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం ఎమ్మెల్యే, టిపిసిసి ఉపాధ్యక్షులు పొదెం వీరయ్యని, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించడం ఎంతమాత్రం తగదని కాంగ్రెస్ పార్టీ భద్రాచలం టౌన్ అధ్యక్షుడు సరెళ్ళ నరేష్ అన్నారు. భద్రాచలం అభివృద్ధికి అనుక్షణం పొదెం వీరయ్య కృషిచేస్తున్నారని తెలిపారు.‌ భద్రాచలం సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయించామని ఎమ్మెల్సీ బాలసాని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హైవే‌కి సంబంధించిన పనులకు భద్రాచలం గ్రామపంచాయతీ నిధులు ఖర్చు చేయడం నిజంగా దౌర్భాగ్యం అన్నారు.

పంచాయతీ పరిధిలో మురికి కాలువలు, రోడ్లులేక ప్రజలు అవస్థలు పడుతుంటే అవి గాలికి వదిలేసిన టీఆర్ఎస్ నాయకులు సెంట్రల్ లైటింగ్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి వంద కోట్ల నిధులు ఇస్తామన్న కేసీఆర్‌ని ఒప్పించి నిధులు తెప్పించుకునే పరిస్థితుల్లో ఎమ్మెల్సీ లేరని అన్నారు. కనీసం 5 గ్రామపంచాయతీలు తీసుకొస్తే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అసెంబ్లీలో చర్చ చేసినా దానిపై టిఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గిరిజనుల పోడు భూముల విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఎమ్మెల్సీ ఎందుకు మాట్లాడటంలేదని అన్నారు.‌

Tags:    

Similar News