‘ఇరు ప్రాంతాల రైతులకూ మేలు చేస్తాం’
దిశ, నల్లగొండ: ధర్మారెడ్డి కాలువ పెండింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తి చేసి చిట్యాల, రామన్నపేట మండలాల ఇరు ప్రాంతాల రైతులకూ మేలు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సాగుబావిగూడెం(సర్నేనిగూడెం) గ్రామంలోని ధర్మారెడ్డిపల్లి కాల్వ గైడ్వాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. రామన్నపేట, చిట్యాల మండల […]
దిశ, నల్లగొండ: ధర్మారెడ్డి కాలువ పెండింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తి చేసి చిట్యాల, రామన్నపేట మండలాల ఇరు ప్రాంతాల రైతులకూ మేలు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సాగుబావిగూడెం(సర్నేనిగూడెం) గ్రామంలోని ధర్మారెడ్డిపల్లి కాల్వ గైడ్వాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. రామన్నపేట, చిట్యాల మండల ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల రైతులకు న్యాయం చేస్తామని, ఒకట్రెండు రోజుల్లో జిల్లా మంత్రి, కలెక్టర్‌తో సమావేశం నిర్వహించి ఇరు ప్రాంతాల రైతులకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అందరికి సమానమైన న్యాయం జరిగేలా చూస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.