ఎమ్మెల్యే పౌరసత్వం కేసు విచారణ వాయిదా

దిశ, న్యూస్ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే నెల 27వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరుగుతున్నందున చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణను రెగ్యులర్ కోర్టులో విచారించనున్నట్లు హైకోర్టు బెంచ్ పేర్కొంది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ గతంలో జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ చెన్నమనేని రమేష్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ […]

Update: 2020-06-16 11:37 GMT

దిశ, న్యూస్ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే నెల 27వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరుగుతున్నందున చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణను రెగ్యులర్ కోర్టులో విచారించనున్నట్లు హైకోర్టు బెంచ్ పేర్కొంది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ గతంలో జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ చెన్నమనేని రమేష్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరో పిటిషన్‌లో కోరారు. ఈ రెండు పిటిషన్లు మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల్లో విచారించలేమని, రెగ్యులర్‌ కోర్టులోనే విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రకారం తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.

Tags:    

Similar News