దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది: చల్లా ధర్మారెడ్డి

దిశ, కమలాపూర్: దేశంలోనే ఒక గొప్ప పథకంగా దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. దళిత బంధు పథకంపై కొందరు నాయకులు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అటువంటి అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. […]

Update: 2021-08-15 05:15 GMT

దిశ, కమలాపూర్: దేశంలోనే ఒక గొప్ప పథకంగా దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. దళిత బంధు పథకంపై కొందరు నాయకులు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అటువంటి అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రేపు హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సమావేశానికి మండలం నుంచి 15 వేల మందికి పైగా స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారని, అన్ని గ్రామాల నుండి ప్రజలు తరలి రావాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News