తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన గత మూడు రోజుల నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శనివారం […]
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన గత మూడు రోజుల నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శనివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో బాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎవరితో సన్నిహితంగా ఉన్నారు. ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.