అలుగు పారుతున్న చెక్‌డ్యాం.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని లాల్‌కోట చెక్ డ్యాం అలుగు పారుతుండటంతో గ్రామస్తులైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించి, గ్రామస్తులతో కలిసి జల సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే కార్యక్రమాలలో భాగంగా కోయిల్ సాగర్ నుండి ఒకచెట్టు వాగు ద్వారా వెళ్లే నీటిని ఉపయోగంలోకి తీసుకురావాలని లాల్ కోట గ్రామం వద్ద ఈ చెక్ డ్యాంను నిర్మించారు. ఇప్పటికే ఊక చెట్టు వాగు ద్వారా […]

Update: 2021-04-15 10:53 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని లాల్‌కోట చెక్ డ్యాం అలుగు పారుతుండటంతో గ్రామస్తులైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించి, గ్రామస్తులతో కలిసి జల సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే కార్యక్రమాలలో భాగంగా కోయిల్ సాగర్ నుండి ఒకచెట్టు వాగు ద్వారా వెళ్లే నీటిని ఉపయోగంలోకి తీసుకురావాలని లాల్ కోట గ్రామం వద్ద ఈ చెక్ డ్యాంను నిర్మించారు. ఇప్పటికే ఊక చెట్టు వాగు ద్వారా నీళ్లు వచ్చి చెక్ డ్యామ్‌లో చేరుతుండడంతో జలకళను సంతరించుకుంది.

తాజాగా.. గత రెండ్రోజులుగా వర్షాలు కురియడంతో వాగు ద్వారా నీటి ఉదృతి మరింత పెరిగి గురువారం అలుగు పారింది. దీంతో గ్రామస్తులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ఆహ్వానించి చెక్ డ్యామ్ వద్ద సంబురాలు నిర్వహించారు. అలుగు వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

Tags:    

Similar News