10వేల పరుగుల క్లబ్‌లో మిథాలీ రాజ్

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన మైలురాయిని చేరుకున్నది. 10 వేల పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. వన్డే జట్టు కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ శుక్రవారం లక్నోలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో ఈ ఘనతను సాధించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో 36 పరుగులు చేసిన మిథాలీ.. అన్నీ బాష్ బౌలింగ్‌లో 36 పరుగుల వద్ద అవుటైంది. అయితే అప్పటికే ఆమె 10 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి […]

Update: 2021-03-12 02:50 GMT

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన మైలురాయిని చేరుకున్నది. 10 వేల పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. వన్డే జట్టు కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ శుక్రవారం లక్నోలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో ఈ ఘనతను సాధించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో 36 పరుగులు చేసిన మిథాలీ.. అన్నీ బాష్ బౌలింగ్‌లో 36 పరుగుల వద్ద అవుటైంది. అయితే అప్పటికే ఆమె 10 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నది. వన్డేల్లో 6974 పరుగులు, టీ20ల్లో 2364 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ.. 10 టెస్టు మ్యాచ్‌లలో 663 పరుగులు చేసింది. మిథాలీ కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ మాత్రమే 10 వేల మైలు రాయిని చేరుకున్నది. మిథాలీ 10వేల పరుగుల సందర్భంగా బీసీసీఐ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేసింది. సచిన్ కూడా మిధాలీ మైలు రాయిని అభినందించాడు.

Tags:    

Similar News