బద్ధలైన మిషన్ భగీరథ పైప్‌లైన్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచినీరు అందించే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం రానురాను నీరు గారుతోంది.దీని నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటమే కాకుండా, నాసిరకం పనుల వలన పలుచోట్ల లీకులు ఏర్పడి నీరు వృథాగా పోతుంది. తాజాగా గురువారం యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ బద్దలై నీరు భారీ ఎత్తున ఎగసిపడతోంది. రోడ్డంతా నీరు చిమ్ముతుండటంతో అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు […]

Update: 2020-10-29 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచినీరు అందించే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం రానురాను నీరు గారుతోంది.దీని నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటమే కాకుండా, నాసిరకం పనుల వలన పలుచోట్ల లీకులు ఏర్పడి నీరు వృథాగా పోతుంది.

తాజాగా గురువారం యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ బద్దలై నీరు భారీ ఎత్తున ఎగసిపడతోంది. రోడ్డంతా నీరు చిమ్ముతుండటంతో అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీసం స్పందించకపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News