మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకున్న ఆండ్రియా
దిశ, సినిమా : మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్-2020 కిరీటాన్ని సొంతం చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మోడల్ అయిన ఆండ్రియా.. ఈ టైటిల్ గెలుచుకున్న మూడవ మెక్సికల్ ఉమన్‌గా రికార్డ్ సృష్టించింది. యూఎస్ ఫ్లోరిడాలోని గిటార్ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో 73 మంది అందాల భామలతో పోటీపడిన తను 69వ మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకుంది. బ్రెజిల్‌కు చెందిన జులియా గమ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. పెరుకు చెందిన జానిక్ మాసెటా సెకండ్ […]
దిశ, సినిమా : మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్-2020 కిరీటాన్ని సొంతం చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మోడల్ అయిన ఆండ్రియా.. ఈ టైటిల్ గెలుచుకున్న మూడవ మెక్సికల్ ఉమన్‌గా రికార్డ్ సృష్టించింది. యూఎస్ ఫ్లోరిడాలోని గిటార్ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో 73 మంది అందాల భామలతో పోటీపడిన తను 69వ మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకుంది. బ్రెజిల్‌కు చెందిన జులియా గమ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. పెరుకు చెందిన జానిక్ మాసెటా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 22 ఏళ్ల అడెలైన్ కాస్టెలినో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి గట్టి పోటీ ఇచ్చింది.
మెక్సికోకు చెందిన 26 ఏళ్ల ఆండ్రియా ఆగస్టు 13, 1994న అల్మా కార్మోనా, శాంటియాగో మెజా దంపతులకు జన్మించింది. మెక్సికోలోని చివావా సిటీకి చెందిన ఆమె లింగ అసమానతలు, జెండర్ వాయిలెన్స్‌పై హార్డ్ హిట్టింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. చైనా సంతతికి చెందిన ఆమె.. 2017లో చివావా అటానమస్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
WHO ARE YOU? #missuniverse pic.twitter.com/WFPhNz4zO6
— Miss Universe (@MissUniverse) May 17, 2021