మీర్జాపూర్ సిరీస్‌కు ఇంటర్నేషనల్ అవార్డు
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే మీర్జాపూర్ వెబ్ సిరీస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గ్యాంగ్‌వార్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో మీర్జాపుర్ బోల్డ్ డైలాగ్స్‌కు స్టార్టింగ్‌లో విమర్శలు వచ్చినప్పటికీ ఆ తరువాత విమర్శకుల ప్రశంసలు పొంది ఔరా అనిపించిది. అంతే కాకుండా ఈ వెబ్‌సిరీస్ స్టార్ అయినా తరువాత అమెజాన్‌కు సబ్ స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోయారు. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో […]
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే మీర్జాపూర్ వెబ్ సిరీస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గ్యాంగ్‌వార్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో మీర్జాపుర్ బోల్డ్ డైలాగ్స్‌కు స్టార్టింగ్‌లో విమర్శలు వచ్చినప్పటికీ ఆ తరువాత విమర్శకుల ప్రశంసలు పొంది ఔరా అనిపించిది. అంతే కాకుండా ఈ వెబ్‌సిరీస్ స్టార్ అయినా తరువాత అమెజాన్‌కు సబ్ స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోయారు. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో టాప్ షోగా ఈ వెబ్‌సిరీస్ ఎంపిక కాగా.. సింగపూర్‌లో డిసెంబర్ 2, 3వ తేదీల్లో జరిగిన ఈవెంట్‌లో అవార్డును అందుకుంది యూనిట్. మీర్జాపూర్ సీజన్ -2 కు ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న సందర్బంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్ మాట్లడుతూ.. ‘వరల్డ్ వైడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని కంటెంట్‌ను రూపొందిస్తున్నాం. భారత్‌లో మేం అడుగుపెట్టి 5 ఏళ్లు పూర్తయింది. మా ప్రతిభను గుర్తించి ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ ప్రదానం చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మా స్వరూప్ మిశ్రాను గుర్తు చేసుకుంటున్నాను. మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌లో లలిత్ అనే పాత్రను అతడు షోషించాడు. అలాంటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవటం చాలా బాధకరమైన విషయం. మీర్జాపూర్ వెబ్‌సిరీస్ బృందానికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను ’ అని తెలిపాడు.